శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా ప్రొఫెసర్ జి. వెంకట రమణ నియామకం
అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రాల విభాగానికి చెందిన ప్రొఫెసర్ జి. వెంకట రమణను సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా నియమిస్తూ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ఇప్పటివరకు సంచాలకుడిగా వ్యవహరించిన గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవా విభాగం ప్రొఫెసర్ ఎం. మునినారాయణప్ప నూతన సంచాలకుడికి బాధ్యతలు అప్పగించాలని విశ్వవిద్యాలయం ఆదేశించింది.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్