భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి ; సంగారెడ్డి మండలంలోని నాగపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన భూ భారతి – భూముల రీ సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి కార్యక్రమం, భూముల రీ సర్వే ప్రక్రియ, దాని ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామస్థులకు, రైతులకు అవగాహన కల్పించారు. భూముల రీ సర్వే ద్వారా భూ రికార్డుల్లో పారదర్శకత పెరుగుతుందని, భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని వివరించారు.రైతులు రీ సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తమ భూములకు సంబంధించిన సరైన వివరాలను అధికారులకు అందించి సర్వే ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ సూచించారు.అదేవిధంగా ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్, సంగారెడ్డి తహసీల్దార్ జయరాం నాయక్, డ్యూటీ ఏడీ సర్వే రాజు, మండల సర్వేయర్ మురళీధర్, గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్, గ్రామ కార్యదర్శి జగన్,వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.