BREAKING
ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం

అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం

Select Suryaa Now
అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం

మదనపల్లె,మేజర్ న్యూస్ : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం మదనపల్లె శాఖా గ్రంథాలయం లో ముగింపు కార్య క్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రంథాలయ అధికారిని ఆర్.వసంతకుమారి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో గ్రంథాలయాల పాత్ర,వాటి ప్రాముఖ్యత,ఉపయోగాలను వివరించారు.జ్ఞానోదయ పాఠశాలల కరస్పాండెంట్ కామకోటి ప్రసాద రావు మాట్లాడుతూ బుక్ కల్చర్,లుక్ కల్చర్ మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించారు.ఆధునిక సాంకేతికతను అవసరమైన మేరకే ఉపయోగించుకోవాలని,పఠన సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.బీటీ కళాశాల కరస్పాండెంట్ వై.ఎస్ మునిరత్నం మాట్లాడుతూ  విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని సమాజం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలన్నారు.ప్రముఖ కథా,నవలా రచయిత,విమర్శకులు టీఎస్ఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆధునిక సమాజంలో మానవులు ఎదుర్కొంటున్న సంఘర్షణలను వివరిస్తూ విద్యార్థులు మంచి చెడులను గుర్తిస్తూ మానవతా విలువలను పెంపొందించుకోవాలని సూచించారు.విశ్రాంత రైల్వే ఇంజనీర్,పద్యకవి కరణం విద్యాసాగర్ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ మాతృభాష పట్ల అభి మానం పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.విశ్రాంత ఉపాధ్యాయిని సురభి హేమలత మాట్లాడుతూ గ్రంథాలయంలో అలవర్చుకునే క్రమశిక్షణ విద్యార్థుల పాఠశాల జీవితంలోనూ ప్రతిబింబిస్తుందని,అది వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుందని తెలిపారు.ఈ సందర్భంగా గ్రంథాలయానికి ఇన్వర్టర్ అందించాలని వసంత కుమారి కోరగా,తమ సంస్థ తరఫున ఇన్వర్టర్ అందించేందుకు వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుంపు భానుప్రకాష్ సంతోషంగా అంగీకరించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు బాలాజీ,నవ్య,వినయ్,వి.ఎం.నాగరాజు,యుగంధర్ ఆచారి,శరత్ బాబు,జనార్దన్ రెడ్డి,బండి రెడ్డప్ప,సింగపూర్ కిషోర్ చౌదరి,ఉద్యోగిని జయమ్మ  పాల్గొన్నారు.అలాగే వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,గిరిరావు దివ్యజ్ఞాన ఉన్నత పాఠశాల,గ్లోబల్ పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,జ్ఞానోదయ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.అలాగే వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు   సర్టిఫికెట్లు,జ్ఞాపికలను అందజేశారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి