andhrapradesh
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి
Andhrapradesh
20 Nov 2026
50 views
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి
- గ్రంథాలయ ముగింపు వారోత్సవాలలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ పిలుపు
- వకృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానం
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : విజ్ఞానానికి, వికాసానికి నిలయాలుగా, ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు దోహదపడుతున్న గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని.. విద్యార్థులు, యువత ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంధాలయంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు... శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు వారోత్సవాలకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్, సమాజ సేవకులు రవికాంత్ క్యాటరింగ్ అధినేత కె.వి రమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వారోత్సవాల్లో సందర్భంగా వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం పోటీలలో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రంధాలయాలు నేటి.. ఆధునిక దేవాలయాలని.. ఇక్కడ విజ్ఞానానికి, పోటీ పరీక్షలకు ఉపయోగపడే అనేక పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, వీటిని విద్యార్థులు, నిరుద్యోగులు, పాఠకులు వినియోగించుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా కేంద్ర గ్రంధాలయం గత అనేక సంవత్సరాలుగా.. సేవలను అందిస్తోందని ఇక్కడ చదివినవారు ఎంతో మంది ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన పుస్తకం విలువ పుస్తకానిదేనని ప్రతిఒక్కరు పుస్తక పఠనం అలవరచుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సమాజ అభివృద్ధి కోసం గ్రంధాలయాల పాత్ర .. చాలా ముఖ్యమైందన్నారు. నిరుపేద వర్గాల ప్రజలకు గ్రంధాలయాలు ఎంతగానో సేవలు అందిస్తున్నాయని కొనియాడారు. పిల్లలు సెల్ ఫోన్ కు బానిసరి కాకుండా... గ్రంథలయాలకు వచ్చి పుస్తక పఠనం అలవర్చుకోవడం ద్వారా ఉన్నత చదువులు, క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. గ్రంథాలయ సంస్థ
చైర్మన్ వడ్డే వెంకట్ మాట్లాడుతూ త్వరలోనే అనంతపురం నగరంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో ఒక స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ స్టడీ సెంటర్ లో సివిల్స్ గ్రూప్ I, గ్రూప్ II బ్యాంకు, రైల్వే డిస్సీ, అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల నోటిఫికెషన్లు విడుదల చేసినందున వాటికీ సంబందించిన మెటీరియల్ అందుబాటులో ఉంచుతామని వాటిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జె శివప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అందరు గ్రంధాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంచుకువాలని కోరారు. అనంతరం ముఖ్య అతిథులకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ , కార్యదర్శి శాలువా కప్పి మెమెంటో బహుకరించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కళా భూషణ్ అంకె రామలింగయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీరాములు, డిప్యూటీ గ్రంధాలయాధికారి పి కమ్మన్న, సహా గ్రంధాలయాధికారి డి గోవిందు, కార్యాలయ సిబ్బంది రామాంజినమ్మ, కిరణ్, జీవన,ముత్యాలమ్మ, ఇందిరమ్మ,శిరీషా, శ్రీవిజయ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Breaking News