BREAKING
ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట

Select Suryaa Now
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట

కోహిర్ ;  కోహిర్ మండలం గొట్టిగార్పల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 11 ఎకరాల్లో సాగు చేసిన చెరుకు పంట పూర్తిగా కాలి బూడిదైంది. ఏడాది పొడవునా ఎంతో కష్టపడి, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన రైతులు గొల్ల శివన్న, పండరి, అంజన్న, నారాయణ, మల్లేశ్, అశోక్‌లకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని బాధిత రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుల భారంతో కుంగిపోయిన తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.