BREAKING
ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం

అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Select Suryaa Now
అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

ఝ‌రాసంగం  ః బోరెగావ్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సర్పంచ్, ప్రజాప్రతినిధులు రేషన్ కార్డులను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పట్లొళ్ల నాగేందర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఉపసర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యుడు దిలీప్, ఇతర వార్డు సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలనే ఉద్దేశంతో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందడంతో పాటు, అర్హతను బట్టి వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.