BREAKING
ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్.

Select Suryaa Now
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి  - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్.

రామచంద్రాపురం.; తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రామచంద్రాపురం మండల మహాసభ శుక్రవారం మండల అధ్యక్షులు ఎస్. రవీందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కోశాధికారి టి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జీఓ 25ను సవరించాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
నూతన మండల అధ్యక్షుడిగా బి. డానియేల్, ప్రధాన కార్యదర్శిగా ఎస్. రవీందర్, ఉపాధ్యక్షులుగా ఆర్. నర్సింగరావు, జి. సునీత, కోశాధికారిగా యు. సిద్ధేశ్వర్ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు డానియేల్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు, దిలీప్ సింగ్ ఠాకూర్, జి. విశాలి, లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు