BREAKING
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి:ఘట్‌కేసర్ సీఐ పి. కిరణ్ కీసర డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొమ్ము చిరంజీవి నూతనకల్ లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్తులకు వైద్య సేవలు రోడ్డుపైకి దూసుకొచ్చిన ఇంటి స్లాబ్‌.. అక్రమ నిర్మాణంపై స్థానికుల ఆగ్రహం.. కాలువను దాటి రోడ్డు వైపు నిర్మాణం.. అధికారులు స్పందించి తొలగించాలని ఫిర్యాదు.. భృంగి సీబీఎస్ఈ ఉపాధ్యాయులతో సమావేశమైన మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సర్పంచ్ గా నడిపల్లి గంగా భవాని ..! ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:ఎంపీడీవో ఉషనప్ప రైతుల కష్టాలకు చెక్.. మైల్వార్‌లో నూతన మోరం రోడ్డు పనులు ప్రారంభం కస్లాబాద్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం కోకట్ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ పేద కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా:సర్పంచ్ అంజలి, భరత్ నాయక్ రైతులు భూ రీసర్వేకు సహకరించాలి: ఆర్‌ఐ రవీందర్ చారి గిరిజన యువతకు నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు ఇప్పాయిపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం

Select Suryaa Now
ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం

సిద్దిపేట అర్బన్,  : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిందని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ అన్నారు.సభ ముగిసిన అనంతరం బస్సు కోసం వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో సారవ్వ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. అంతేకాకుండా మహిళా సంఘం సభ్యురాలిగా ఉన్న సారవ్వకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా పరిహారం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాలీముద్దీన్ అహ్మద్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.