telangana
అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం
దోమ, మేజర్ న్యూస్:దోమ గ్రామపంచాయతీ పరిధిలోని ఉదన్‌రావుపల్లి గ్రామానికి చెందిన నీరటి దస్తయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దోమ మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గోపాల్ శ్రీనివాస్ యాదవ్ సోదరుడు గోపాల్ తిరుపతి యాదవ్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి అండగా నిలుస్తూ అంత్యక్రియలు, తక్షణ అవసరాల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాములు, వెంకట రాములు, యాదయ్య, బాలకృష్ణయ్య, రాములు, నవీన్ కుమార్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.