కసింకోట సర్పంచ్, 6వార్డులు ఏకగ్రీవం సర్పంచ్ గా నడిపల్లి గంగా భవాని ..!
అనకాపల్లి ప్రతినిధి, మేజర్ న్యూస్;
కసింకోట మేజర్ పంచాయతీ సర్పంచ్ గా నడిపల్లి గంగ భవాని, మరో ఆరు వార్డులు ఏకగ్రీవo అయ్యాయి. నడిపల్లి గంగ భవాని ఇంత వరకు బిజెపి ఎంపీటీసీగా పనిచేశారు. ఇప్పుడు కూడా కూటమి బలపరిచిన బిజెపి అభ్యర్థిగా గంగ భవాని సర్పంచిగా పోటీలో నిలిచారు. గంగ భవాని భర్త గతంలో పంచాయతీ వైస్ సర్పంచిగా కూడా పనిచేశారు.అయితే వైసీపీ తరఫునుంచి కూడా ఎల్లపు అన్నపూర్ణ, పెంటకోట కుమారి, మరో ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. వైసిపి అభ్యర్థులు నామినేషన్లు అయితే వేశారు గాని సర్పంచ్ బరిలో పోటీ చేయడానికి చేతులెత్తేసి, వైసిపి అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో గంగ భవాని ఏకగ్రీవం అయింది. అలాగే ఆరవ వార్డు నుంచి కోటిని గణేషు, 8వ వార్డు నుంచి జెర్రీ పోతుల వరలక్ష్మి, 11వ వార్డు నుంచి నక్క నాగమణి,12వ వార్డు నుంచి నడిపల్లి దివ్యలక్ష్మి, 15వ వార్డు నుంచి వేగి సాయి,16వ వార్డు నుంచి బత్తిన సూర్య నాగలక్ష్మి ఏకగ్రీవాలు అయ్యాయి. కసింకోట మేజర్ పంచాయతీలో 18 వార్డులకు గాను ఆరు వార్డులు ఏకగ్రీవం కావడంతో మరో 12 వార్డులకు ఎన్నిక కానుంది.
కసింకోట చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏకగ్రీవం జరగడం ఇదే మొదటిసారి. గత ఎన్నికలలో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నంతగా పోటీపడేవారు. కసింకోట మేజర్ పంచాయితీలో ప్రధానంగా కుల సామాజిక వారిగా కాపు, గవర, యాదవ, ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి. వీటిలో పంచాయతీ ఎన్నికలలో చివరకు వచ్చేసరికి కాపు, గవర సామాజిక వర్గాల మధ్య నువ్వా, నేనా అన్నట్టు సర్పంచ్ పదవికి పోటీ రసవత్రంగా జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఏకగ్రీవం కావడంతో కసంకోట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనే కసింకోట ఏకగ్రీవానికి కారణం అని పలువురు అంటున్నారు.
రిపోర్టర్ :రవికుమార్, అనకాపల్లి జిల్లా ప్రతినిధి.