ఇప్పాయిపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం
కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని స్థానిక సర్పంచ్ పోటీ మల్లేష్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ చైర్మన్ బి. ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి, మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ నాయక్, ఉపసర్పంచ్ వడ్డే లక్ష్మి, మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు వెంకటయ్య, కుల్కచర్ల మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, డైరెక్టర్ రామచంద్రయ్య, వార్డు సభ్యులు అంజనేయులు, రఘు, వై. రాములు, గ్రామ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.