పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు
మదనపల్లి,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా,మదనపల్లి పట్టణం ముఖ్య కేంద్రంగా పలుసేవ కార్యక్రమాలు చేపడుతున్న బహుజన యువసేన (బీవైఎస్) అధ్యక్షులు పునీత్ కుమార్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నడుమ వేడుకగా జరిగాయి.పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన ఈ వేడుకలకు ప్రముఖులు,మిత్రులు,బివైఎస్ సభ్యులు హాజరయ్యారు.ముందుగా పునీత్ కుమార్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం,సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి,వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.మున్సిపల్ కార్మికులకు,పేదలకు ఉచితంగా చీరల పంపిణీ చేశారు.రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా హెల్మెట్లను అందజేశారు.మున్సిపల్ కార్మికులు,నిస్సహాయులకు భారీఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ మన ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా,గర్వంగా ఉందన్నారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలు,నిస్సహాయులకు నా వంతు సహాయం చేయడమే నా జన్మదినానికి అసలైన అర్థమన్నారు.ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ కుటుంబాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు,కార్యకర్తలు,మున్సిపల్ కార్మికులు,స్థానికులు పెద్దఎత్తున పాల్గొని పునీత్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి