స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక
అనంతపురం విద్య మేజర్ న్యూస్:-జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో వివిధ విభాగాల్లో సత్తా చాటి, మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
మహిళల విభాగంలో అండర్-14 బటర్‌ఫ్లైలో పి. సునీత, వి. విష్ణుప్రియ, అండర్-14 బ్యాక్‌స్ట్రోక్‌లో జి. హంసప్రియ, అండర్-17 బ్యాక్‌స్ట్రోక్‌లో జి. రిషిత రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.
పురుషుల విభాగంలో అండర్-14 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పి.ఎల్. రుత్విక్, ఎన్. విషాల్, అండర్-17 ఫ్రీస్టైల్‌లో ఎస్. వరుణ్ దీప్ రెడ్డి, అండర్-17 బ్యాక్‌స్ట్రోక్‌లో బి. వెంకటరెడ్డి ఎంపికయ్యారు.
విద్యార్థుల విజయంపై పాఠశాల చైర్మన్ అనంత రాముడు అభినందనలు తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఇదే ఉత్సాహంతో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సీఎఓ నరసింహారావు, ప్రిన్సిపల్ కె.వి. శాలిని, పీఈటీలు జిలాన్, అజిత్ దాస్ పాల్గొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..