ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు
చీపురుపల్లి మేజర్ న్యూస్: స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఎం బూసి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు గంట పాటు గ్రంథాలయంలో గడిపి పుస్తకపఠనం చేయాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేశారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని గ్రంథాలయ సంస్థ అధికారి ఉషారాణి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా