రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక..
అనంతపురం విద్య మేజర్ న్యూస్ :-విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో నిర్వహించనున్న అండర్-17 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు సిద్దరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన హారిక, మునీంద్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కాగా, వర్షిత స్టాండ్‌బై క్రీడాకారిణిగా ఎంపికైంది.
ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ వెల్లడించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల వ్యాయామ విద్యా సంచాలకులు గట్టు నాగరాజుతో పాటు ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటప్ప, ఆదినారాయణ, బాలకృష్ణ, కమల, మధుబాల, ఉమాబాయి అభినందించారు. అలాగే తోటి విద్యార్థులు సైతం హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఉపాధ్యాయ బృందం ఆకాంక్షించింది.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..