BREAKING
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు జిల్లా స్థాయికి ఎంపిక కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థిని ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవం : రామాచార్లపల్లి-1,బసినికొండ ఎంపిటిసిలు ఎన్.శారద,పి.నాగరాణిలు వెల్లడి సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు.. శ్రీవారి ఆలయంలో నేడు కైశికద్వాదశి ఆస్థానం..మాడవీధుల్లో ఊరేగనున్న ఉగ్రశ్రీనివాసమూర్తి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా ప్రొఫెసర్ జి. వెంకట రమణ నియామకం యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక.. ఘనంగా గ్రంథాలయాల 59వ వారోత్సవాల ముగింపు వేడుకలు స్విమ్మింగ్‌లో అనంతలక్ష్మి విద్యార్థుల సత్తా.. రాష్ట్రస్థాయికి 8 మంది ఎంపిక నల్లమాడ సర్పంచ్ గా గెలిపిస్తే...పంచాయతీ రూపురేఖలు మారుస్తా... దాసరి సూర్యనారాయణ రెడ్డి అల్లా దయతో ఆదరించండి :సర్పంచ్ అభ్యర్థులు భూ భారతి, భూముల రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు

Select Suryaa Now
యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు

పాలమూరు యూనివర్సిటీ మేజర్ న్యూస్ -

ఉన్నత విద్యలో పరిశోధన ప్రమాణాలను పెంపొందిస్తూ, పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియను యూజీసీ (రివైజ్డ్ ) నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని పాలమూరు యూనివర్సిటీ వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ శుక్రవారం సూచించారు. పరిశోధన అనేది కేవలం డిగ్రీ పొందడానికే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు దోహదపడాలని అన్నారు.
పీహెచ్‌డీ ప్రవేశాల నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ రూపొందించిన ప్రతిపాదనలను వీసీ, రిజిస్ట్రార్  పీ రమేష్ బాబు ఆమోదించారు. 
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ,ప్రవేశాల ప్రక్రియ నుంచి పరిశోధన పూర్తయ్యే వరకు యూజీసీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అర్హత, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పరిశోధక విద్యార్థులకు నాణ్యమైన పరిశోధనా వాతావరణాన్ని కల్పించాలని పేర్కొన్నారు.*
ఈ కార్యక్రమంలో అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి డా. కె. ప్రవీణ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి,ప్రొఫెసర్ నూర్జహాన్, జాయింట్ డైరెక్టర్ డా. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఓం ప్రకాష్ .పాలమూరు యూనివర్సిటీ.మహబూబ్ నగర్