BREAKING
ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం నీటిని పొదుపుగా వాడటం ప్రతి ఒక్కరి బాధ్యత సంవిధాన్ ఉత్సవ్ -2026 ధర్మస్థలంలో ఘనంగా దీపికమ్మ సోదరి వివాహ వేడుక.. ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన 59వ వారోత్సవాలు జాతీయ గ్రంధాలయ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి వేడుకగా సాగిన వైసిపి నాయకుడు బాలాజీ గృహప్రవేశం : హాజరైన వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,నాయకులు జిల్లా స్థాయికి ఎంపిక కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న విద్యార్థిని ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవం : రామాచార్లపల్లి-1,బసినికొండ ఎంపిటిసిలు ఎన్.శారద,పి.నాగరాణిలు వెల్లడి సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా ముగిసిన ఆర్డీటీ బాలల హక్కుల వారోత్సవాలు.. శ్రీవారి ఆలయంలో నేడు కైశికద్వాదశి ఆస్థానం..మాడవీధుల్లో ఊరేగనున్న ఉగ్రశ్రీనివాసమూర్తి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సామాజిక సమ్మిళిత అధ్యయన కేంద్రం సంచాలకుడిగా ప్రొఫెసర్ జి. వెంకట రమణ నియామకం యూజిసి నిబంధన మేరకే పి హెచ్డీ ప్రవేశాలు జనహిత సంఘం ఆవిర్భావం.. సమాజ శ్రేయస్సే లక్ష్యం.. రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవకు కృషి చేస్తాం.. రాష్ట్ర అధ్యక్షుడు కురుగుంట మనోహర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు సిద్దరాంపురం విద్యార్థుల ఎంపిక..

ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవం : రామాచార్లపల్లి-1,బసినికొండ ఎంపిటిసిలు ఎన్.శారద,పి.నాగరాణిలు వెల్లడి

Select Suryaa Now
ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం గొప్ప గౌరవం : రామాచార్లపల్లి-1,బసినికొండ ఎంపిటిసిలు ఎన్.శారద,పి.నాగరాణిలు వెల్లడి

మదనపల్లి టౌన్,మేజర్ న్యూస్ : ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని రామాచార్లపల్లి-1,బసినికొండ తెలుగుదేశం పార్టీ ఎంపిటిసిలు నారప్పగారి శారద,పి.నాగరాణిలు పేర్కొన్నారు.గురువారం ఎంపీపీ,ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు అట్టహాసంగా జరిగింది.వీరిద్దరి చేత ప్రెసీడింగ్ ఆఫీసర్,ఎంపీడీవో లు ప్రమాణం చేయించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఏపీలోని కూటమి ప్రభుత్వం,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు.ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం సీట్లను మహిళలకు కేటాయించి రాజకీయ ప్రాధాన్యత కల్పించడం శుభసూచకమన్నారు.తమకు రాజకీయాలు కొత్త అయినప్పటికీ భర్తల సహకారంతో ప్రజాసేవకు పునరంకితమవుతామని స్పష్టం చేశారు.అదేవిధంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా,ఎంపీపీ బీదం గురునాథ్ యాదవ్ ల సహకారంతో పంచాయతీల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు.తమపై నమ్మకంతో ఎంపీటీసీలుగా గెలిపించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రామాచార్లపల్లి-1 ఎంపీటీసీ శారద భర్త ఎన్.ఆనంద్,బసినికొండ ఎంపీటీసీ నాగరాణి భర్త నటశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి