ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఆహ్వానం
పలమనేరు మేజర్ న్యూస్ ఈ నెల 23వ తేదీన జరగనున్న పలమనేరు మున్సిపల్ చైర్‌పర్సన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దంపతులను మున్సిపల్ చైర్‌పర్సన్ రాజలక్ష్మి కృష్ణమూర్తి, పలువురు కౌన్సిలర్లు కలిసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన వారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులకు కార్యక్రమ వివరాలను తెలియజేసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్