ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి.
తంబళ్లపల్లె, మేజర్ న్యూస్,
తంబళ్లపల్లె మండలంలో శనివారం నుండి పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఎంపీడీవో ఉషారాణి సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో మండలంలోని ఐదు క్లస్టర్లలో శనివారం ఉదయం 10:30 గంటల నుండి 5 గంటల వరకు 22, 23వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగించాలన్నారు. 24న స్క్రూనిటీ, 25న నామినేషన్లు పరిశీలన, 26న అప్పిల్, 27వ తేదీ సాయంత్రం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, మూడు గంటలకు పైన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన, డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుండి ఒంటిగంట వరకు పోలింగ్ రెండు గంటల నుండి కౌంటింగ్ అనంతరం ఎన్నికల ఫలితాలు ప్రకటించాలన్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డుల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ఎన్నికల అధికార యంత్రాంగం సహకరించాలన్నారు. ఈ అవగాహన సదస్సులో డిప్యూటీలు ఎంవీ ప్రసాద్, మారుతీ కుమార్, ఏవో థామస్ రాజా, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.