BREAKING
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి... సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్ బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

“3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

Select Suryaa Now
 “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

నరసరావుపేట,:  మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నాగసరపు రూపేష్ గుప్తా 3వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఈ నెల 26న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని ఆయన వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బారాయ గుప్తా, టీడీపీ నాయకులు కపిలవాయి విజయకుమార్, సత్తెనపల్లి టీడీపీ నాయకులు సింగరాజు సాయికృష్ణ తదితరులు పాల్గొని రూపేష్ గుప్తాతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలపై వివరాలు సేకరించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని రూపేష్ గుప్తా హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడమే కూటమి లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో 3వ వార్డులో ఎన్నికల ప్రచార సందడి నెలకొంది. ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజలతో నాయకులు మమేకమవుతూ సాగించిన కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..