BREAKING
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి... సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్ బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక

Select Suryaa Now
ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా  పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక

హుస్నాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని మండల ప్రత్యేక అధికారి కొండల్ రెడ్డి అన్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండల్ రెడ్డి గ్రామ ప్రజలకు పథకం ముఖ్య ఉద్దేశాలు, ప్రాధాన్యతను వివరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని అనుకోని పరిస్థితుల్లో కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కుటుంబ పెద్ద మరణంతో ఆధారం కోల్పోయిన కుటుంబాలకు బీమా భరోసా కల్పించడం ద్వారా వారి జీవనానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పరి ప్రశాంత్, హుస్నాబాద్ ఎంపీడీవో సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.