BREAKING
12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం కోహెడ గ్రామం ఘనంగా కల్టివా క్రాప్ క్లినిక్ ప్రారంభోత్సవం 44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం! గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి...

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి...

దుబ్బాక …రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక పురపాలిక కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు.శుక్రవారం దుబ్బాక పురపాలిక కార్యాలయంలో పలువురు వార్డు కౌన్సిలర్లతో కలిసి 5 లక్షల కుటుంబ జీవిత బీమా పథకం యొక్క గోడపత్రికను ఆవిష్కరించి, ఆన్లైన్లో  దరఖాస్తు ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబంలో కుటుంబ యజమాని పేరున బీమా పథకానికి దరఖాస్తు చేసుకొని, నామినీగా కుటుంబ సభ్యుల పేర్లను జత చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాల ద్వారా పురపాలిక కార్యాలయంలో గాని, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల ద్వారా బీమా పథకాన్ని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్న కుటుంబ పెద్ద లేదా కుటుంబాన్ని పోషించే వ్యక్తి పేరు మీద జీవిత బీమా పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు దేవుని రాజు, అనంతుల భాగ్యమ్మ, కోలా నిరోష, బడుగు రాజు, కో ఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్, నసీమా, నాయకులు బండి రాజు అనంతుల శ్రీనివాస్, ఐరేని సాయి తేజ గౌడ్, కోలా వెంకట్ స్వామి గౌడ్, పురపాలిక మేనేజర్ శ్రీనివాస్, మెప్మా ఆర్పీలు, పుర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.