ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య
కుకునూరుపల్లి, .....ప్రజల సంక్షేమమే ధ్యేయమని సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అన్నారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులకు మరియు నూతన పెన్షన్ దారులకు ప్రోసిడెన్సి పత్రాలను పాలకవర్గం సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. అలాగే మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరిస్తేనే గ్రామం పురోగతి సాధ్యమైతుందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుందని అర్హులైన ప్రతి ఒకరికి ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. మన గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయక సహకారాలతో సాధ్యమైందని అన్నారు.లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దొంతి సత్తయ్య పంచాయతీ కార్యదర్శి స్వప్న వార్డు సభ్యులు మహిళలు పాల్గొన్నారు.