మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ
ధారూర్, మేజర్ న్యూస్:మండల పరిధిలోని మోమిన్ కలాన్ గ్రామంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ ధ్రువపత్రాలను పంపిణీ చేశారు.గ్రామ సర్పంచ్ మాధవిబాల్ రాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాధవిబాల్ రాజ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని, లబ్ధిదారులు ఈ పింఛన్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అలాగే గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.