BREAKING
12వ వార్డులో ఇందిరమ్మ భీమా పథకాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఎన్నికల నామినేషన్ల పర్వం పారదర్శకంగా చేయాలి.. ఎంపీడీవో ఉషారాణి. అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఒక్కరోజు ఆమె పాత్రలో.. మహిళల కష్టాలకు సెల్యూట్! ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి - టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు రవీందర్. అట్టహాసంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు : హాజరైన ప్రముఖులు,కవులు,విద్యార్థులు : ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కాలి బూడిదైన 11 ఎకరాల చెరుకు తోట ​పునీత్ కుమార్ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలు : చీరలు,హెల్మెట్ల పంపిణీ,అన్నవితరణ కార్యక్రమం : యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పలువురు ప్రశంసలు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక ప్రమాదంలో మృతి చెందిన సారవ్వ కుటుంబానికి అండగా ఉంటాం కోహెడ గ్రామం ఘనంగా కల్టివా క్రాప్ క్లినిక్ ప్రారంభోత్సవం 44వ వార్డులో జనసేన కౌన్సిలర్ అభ్యర్థి తిరుమలశెట్టి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం! గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్
దౌల్తాబాద్, మేజర్ న్యూస్ :ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆపద సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని చెల్లాపూర్ గ్రామ సర్పంచ్ రోజా రమేష్ అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని చెల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు పథకం వివరాలను తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సర్పంచ్ రోజా రమేష్ మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని కారణాలతో మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని, కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో బాధిత కుటుంబాలకు బీమా మొత్తం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కె. శ్యామప్ప, వార్డు సభ్యులు సుంకరి పకీరప్ప, సి. మహేష్, అనిత, రాఘవేందర్, దాసరి కానుకప్ప, కోస్గి లక్ష్మప్ప, ఏబీఎన్ రిపోర్టర్ హన్మంతు, ఎన్. చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచ్ హన్మప్ప, సుంకరి మల్లేష్, సుంకరి శ్రీనివాస్, పవన్ తదితరులు పాల్గొన్నారు.