పామూరు జడ్పీటీసీగా జాహ్నవి బాధ్యతలు స్వీకారం
పామూరు మేజర్ న్యూస్ : పామూరు మండల జడ్పీటీసీ సభ్యురాలిగా డాక్టర్ బైరెడ్డి జాహ్నవిరెడ్డి శుక్రవారం మార్కాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. పామూరు మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బైరెడ్డి జయరామిరెడ్డి కుమార్తె అయిన డాక్టర్ జాహ్నవిరెడ్డి జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేశారు . ఈ సందర్భంగా జడ్పీటీసీ జాహ్నవి రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో జడ్పీటీసీగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. పామూరు మండల ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.