గుండ్లకొండ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవం
దేవనకొండ మండల ఫరిదిలోని గుండ్లకొండ గ్రామ సర్పంచ్ గా టిడిపి సీనియర్ నాయకులు ఈడిగ రామదాసు గౌడ్ సతీమణి లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గ్రామ పెద్దల సమక్షంలో సంప్రదింపులు చేసుకుని గ్రామ అభివృద్ధి కోసం ఇరువురు రాజీ కావడంతో లక్ష్మిపై పోటీ చేసిన అభ్యర్థి శుక్రవారం విరమించుకున్నారు.దీంతో గ్రామ సర్పంచ్ గా లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నేడు విత్ డ్రా ఆఖరి కావడంతో అధికారులు ప్రకటించాల్సి ఉంది.గ్రామంలో ఎన్నికలు లేకుండా రాజీ మార్గాన వెళ్లడంతో ఇటు గ్రామంతో పాటు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారని గ్రామ ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.