శివాలయం ఉప ప్రధానార్చకులు జాలయ్య ఆకస్మిక మృతి
పెదకాకాని మేజర్ న్యూస్ :పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఉప ప్రధాన అర్చకునిగా పనిచేయుచున్న (ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న) చదలవాడ జాలయ్య ఆకస్మికంగా మృతి చెందినట్లు జాలయ్య కుటుంబ సభ్యులు తెలిపారని ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి పి. శ్రీనివాసులు రెడ్డి, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. చదలవాడ జాలయ్య, ఉప ప్రధాన అర్చక స్వామి వారి ఆకస్మిక మృతి పట్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి శ్రీనివాసులు రెడ్డి, పాలకమండలి ఛైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, సభ్యులు వారి కుటుంబమునకు సంతాపం తెలియజేశారు.