రూ.1.15 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం .. విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్
నరసరావుపేట : పట్టణంలో విజిలెన్స్, జిఎస్టి అధికారులు, నరసరావుపేట వీఆర్వో అధికారి ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.15 కోట్ల విలువైన అక్రమ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్, విజిలెన్స్ సీఐ మాట్లాడుతూ పట్టణంలోని వాసవి కాంప్లెక్స్ వద్ద ఉన్న ఓ షాపులో అక్రమం గా నిల్వ ఉంచిన సిగరెట్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా సిగరెట్లను లారీల ద్వారా నరసరావుపేటకు తరలించి విక్రయిస్తు న్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన కె ఏ 03 ఏ యన్ 7888 నంబరు గల లారీని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. లారీ డ్రైవర్ పలని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నామ న్నారు. అక్రమ సిగరెట్ల వ్యాపారంలో నంబూరి సుబ్బారావు గుప్తా, కృష్ణ అనే వ్యక్తుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…