సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ ; కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామ సర్పంచ్ బోయిని సంపత్ తండ్రి బోయిని వెంకయ్య ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, బసవరాజ్ శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండిపల్లి నారాయణ గౌడ్, మంద ధర్మయ్య, వేల్పుల వెంకటస్వామి ఎన్ఎస్యూ ఐ హుస్నాబాద్ నాయకులు శివారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఇటిక్యాల రాజమౌళి, ఏం సి డైరెక్టర్ పులి రాజు, సీనియర్ నాయకుడు పవన్ శ్రీకాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ రఫీక్, సీనియర్ నాయకులు ఆటలి రాజమౌళి, కార్యదర్శి బుర్ర రవి, వర్తి సంపత్, ఉత్కం శ్రీనివాస్, జావేద్, సంతోష్, సలీం, ఎండి చోటే, ఉప సర్పంచ్ పరివేద లక్ష్మణ్, కరకర్తలు తదితరులు పాల్గొన్నారు.