BREAKING
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రజల సంక్షేమమే నాధ్యేయం సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి ఔషధంపై ఎఫ్‌డీఏ జాప్యం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలి... సేంద్రియ సాగుతో అధిక లాభాలు.. రైతులకు శాస్త్రవేత్తల సూచనలు మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ మోమిన్ కలాన్‌లో చేయూత పింఛన్ ధ్రువపత్రాల పంపిణీ అదనపు వెల్లడి నిబంధనల తొలగింపునకు సెబీ ప్రతిపాదన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ రోజా రమేష్ బడుగు బలహీన వర్గాలకే సంక్షేమ ఫలాలు డేటా సెంటర్లకు స్పెయిన్ కఠిన హరిత నిబంధనలు ఇందిరమ్మ బీమా పథకంతో ప్రతి కుటుంబానికి భరోసా పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మాపూర్ గ్రామం ఎంపిక సర్పంచ్ కు 71, వార్డుకు 366 నామినేషన్లు “3వ వార్డులో ప్రచార జోరు.. రూపేష్ గుప్తాకు నేతల మద్దతు

సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ..

Select Suryaa Now
సిద్దిపేట సభ అనంతరం ప్రమాదంలో మృతి చెందిన కొమ్ము సారవ్వ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ..

హుస్నాబాద్ : సిద్దిపేట సభ అనంతరం బస్సు కోసం వెళ్తున్న హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) ప్రమాదానికి గురై మృతి చెందడంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివ దేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ హైమవతి నివాళులర్పించారు. అనంతరం సారవ్వ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
అదేవిధంగా, సారవ్వ మహిళా సంఘం సభ్యురాలు కావడంతో మహిళా సంఘం సభ్యులకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా కూడా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.