telangana
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్
శామీర్ పేట,మేజర్ న్యూస్:మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్‌ను తూముకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి, తోటకూర వజ్రేష్ యాదవ్ లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.