BREAKING
శంకరాపురం గ్రామ సర్పంచ్ టిడిపి అభ్యర్థిగా మందలపు పూర్ణచంద్రరావు. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి : హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ మెక్సికో-యూరోప్‌లను మరింత దగ్గర చేస్తున్న పరిణామాలు చిత్తూరు రూరల్‌లో అట్టహాసంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జయచంద్ర నాయుడు సమన్వయంతో పనిచేసి కూటమిని మరింత బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ 23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ ఇంకొల్లులో పి.ఓలు, ఏ.పి.ఓలకు శిక్షణ భావోద్వేగ రాజకీయాలకు బలికావద్దు.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: డా. శివ ప్రసాద్

ఎమ్మెల్యే పాడె మోసిన సీఎం విజయ్..

Select Suryaa Now
ఎమ్మెల్యే పాడె మోసిన సీఎం విజయ్..

చెన్నై, నవంబర్ 20:తమిళనాడు అధికార పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) సీనియర్ నేత, కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు (75) అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ అంతిమ యాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ స్వయంగా పాల్గొని వీఎస్ బాబు పాడెను మోసి తన అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు.

గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీఎస్ బాబు, గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం విజయ్ శుక్రవారం ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం నిర్వహించిన అంతిమ యాత్రలో పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది మంది కార్యకర్తలతో కలిసి నడిచిన సీఎం విజయ్, స్వయంగా పాడె మోసి వీడ్కోలు పలికారు.

 జెయింట  కిల్లర్‌గా గుర్తింపు

ఉత్తర చెన్నై రాజకీయాల్లో సీనియర్ నేతగా పేరుగాంచిన వీఎస్ బాబు, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకేలో చేరి కొలత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఆయన సొంత ఇలాకా కొలత్తూరులో 8,795 ఓట్ల తేడాతో ఓడించి 'జెయింట్ కిల్లర్'గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వీఎస్ బాబు మృతి పట్ల మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో కొలత్తూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.