BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు

Select Suryaa Now
23న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాక - బండి సంజయ్, రామచంద్రరావు, సునీల్ బన్సల్ తదితర ప్రముఖుల హాజరు
సూర్య కరీంనగర్ ప్రతినిధి  : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 23న తొలిసారిగా కరీంనగర్‌కు రానుండడంతో భారీ మహా పాదయాత్ర నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం–అరాచకత్వాన్ని పాతరేద్దాం’ నినాదంతో నిర్వహించే ఈ యాత్రకు కనీసం లక్ష మందిని సమీకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. నితిన్ నబీన్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుని, ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వైశ్యాభవన్‌కు వెళ్లి మహా పాదయాత్రలో పాల్గొంటారు. వైశ్యాభవన్ నుంచి టవర్ సర్కిల్, శాస్త్రీరోడ్ మీదుగా కమాన్ వరకు యాత్ర కొనసాగనుంది. నితిన్ నబీన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, సహ ఇన్‌ఛార్జీలు రేఖాశర్మ, అభయ్ పాటిల్ తదితరులు పాల్గొననున్నారు. ‘సర్’ పేరిట ఎన్నికల సంఘం, ఇతర రాజ్యాంగ సంస్థలపై ఇండీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించి, విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడమే మహా పాదయాత్ర లక్ష్యమని బండి సంజయ్ పేర్కొన్నారు. యాత్ర విజయవంతానికి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పార్టీ అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, గంగాడి కృష్ణారెడ్డి, సీనియర్ నేతలు కోమాల అంజనేయులు, నల్లాల ఓదేలు, మోహన్ రెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో జన సమీకరణ చేపట్టాలని, పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కాషాయమయం చేయడంతో పాటు మీడియా, సోషల్ మీడియా ద్వారా నితిన్ నబీన్ రాక, మహా పాదయాత్ర ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు.