BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన

Select Suryaa Now
కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన

సూర్య కోరుట్ల టౌన్: జగిత్యాల జిల్లా కోరుట్ల 
పట్టణంలోని హ్యాపీ స్కూల్ లో "సమాజు సేవకులు  అనే పాఠ్యాంశంలో భాగంగా చిన్నారులు స్థానిక పోలీస్ స్టేషన్ను విద్యా సందర్శనలో భాగంగా సందర్శించారు.
ఈ సందర్భంగా చిన్నారులు పోలీసులతో మాట్లాడి, వారి విధుల గురించి ఆసక్తిగా ప్రశ్నలు అడిగారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేసే పనులను, ఆపదలో) ఉన్న వారికి వారు ఎలా సహాయం అందిస్తారో పోలీసు సిబ్బంది పిల్లలకు సరళంగా వివరించారు. చిన్నారుల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.ప్రజల భద్రత కోసం 24/7 పనిచేస్తూ, అవసరమైన సమయంలో అండగా నిలుస్తున్న పోలీసులకు చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేమతో    గ్రీటింగ్కార్డులు  అందించి, "మాకు, మన సమాజానికి మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు” అని చెప్పారు.చిన్నారులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సందేహాలను తీర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందికి హాపీ స్కూల్ ప్రిన్సిపాల్ రాసబక్తుల. సంతోష్ కుమార్ మరియు ఛైర్మన్ జుక్కం తాజ్ ధన్యవాదాలు తెలిపారు.