రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు
మహబూబ్‌నగర్:
రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీలకు న్యూ రిషి పాఠశాలకు చెందిన విద్యార్థులు యశ్వంత్ రెడ్డి, కిరణ్ ,దినేష్, కార్తికేయ ఎంపికయ్యారు. ఈ నెల 21,22 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్య గారు, డైరెక్టర్లు పూజిత మోహన్ రెడ్డి, సుశాంత్ కృష్ణ ప్రిన్సిపల్ రవీందర్, వ్యాయామ ఉపాధ్యాయుడు విష్ణుకాంత్ గౌడ్ విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.