BREAKING
ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం

రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు

Select Suryaa Now
రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు

 

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. ఐరాల మండలం చెంగనపల్లి గ్రామానికి చెందిన ఎస్. రామకృష్ణ అలియాస్ సనంగి రామకృష్ణ అలియాస్ రాకేష్ (27), తండ్రి లేట్ ఎస్. నాధముని అనే వ్యక్తిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుస నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో వారిపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడటంతో పాటు మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, భూ ఆక్రమణలు, క్రిమినల్ బెదిరింపులు తదితర నేర కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసుల నివేదికలో పేర్కొనబడింది. ఇతనిపై ఐరాల ఇతర పోలీస్ స్టేషన్లలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.ప్రజా శాంతి భద్రతకు విఘాతం కలిగించడం వంటి కారణాలతో, సాధారణ చట్టపరమైన చర్యలు సరిపోనందున జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ , చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి సిఫారసు మేరకు పీ డీ యాక్ట్ కింద నిర్బంధ ఆదేశాలు జారీ చేసి, నిందితుడు ఎస్. రామకృష్ణ అలియాస్ రాకేష్ ను కడప సెంట్రల్ జైలుకు శనివారం తరలించారు.ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నేర కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసులకు తెలియజేయాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి కోరారు.

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.