telangana
శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం
సూర్య కరీంనగర్ : కరీంనగర్‌లోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో విద్యార్థులకు జీవిత నిర్వహణ (లైఫ్ మేనేజ్మెంట్) అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ ధర్మేందర్ నడిమెట్ల విద్యార్థులకు జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, లక్ష్య నిర్దేశం, ఒత్తిడి నియంత్రణ, సానుకూల ఆలోచనా విధానం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి ముఖ్యమైన అంశాలపై మార్గదర్శనం చేసారు.
విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.ప్రణాళికా బద్ధమైన జీవన విధానం విజయానికి పునాది అని తెలియజేస్తూ విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.“చక్కటి ప్రణాళిక – సంతోషకరమైన జీవితం – విజయవంతమైన భవిష్యత్తు” అనే సందేశంతో ఈ కార్యక్రమం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని పాఠశాల కార్యదర్శి కోల అన్నారెడ్డి, ప్రధానాచర్య మోర రణధీర్ తెలియచేసారు .