BREAKING
గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర క్షిపణి దాడుల కంటే ఆర్థిక యుద్ధమే కఠినం.. బాలల రక్షణకు ఉపాధ్యాయులే కీలక రక్షకులు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ శ్రీ సరస్వతీ శిశు మందిర్‌లో “లైఫ్ మేనేజ్‌మెంట్”పై అవగాహన కార్యక్రమం ఏ.ఎస్.డీ.డీ ఓటర్లకు మరో అవకాశం కల్పించి అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చాలి. సీపీఐ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలి - సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి - చాడ వెంకటరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - జిల్లా కలెక్టర్ కె.హరిత వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్ -స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ముదిగుబ్బ సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు జలసిరి పనులపై అవగాహన

జలసిరి పనులపై అవగాహన

Select Suryaa Now
జలసిరి పనులపై అవగాహన

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దర్పల్లి,గురుకుంట గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక కార్యాచరణలో భాగంగా శనివారం ఎంపీడీవో జయరాం నాయక్ ఆధ్వర్యంలో ఎంపీఓ భద్రూ నాయక్,ఏపీవో జ్యోతి,ఏఈ  తదితరులు పర్యటించి ఎల్‌నినో ప్రభావంపై అవగాహన..జలసిరి పనులను గ్రామాల్లోని స్థానిక నీటి వనరులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు,వాటి వల్ల కలిగే ప్రభావాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.అలాగే జలసిరి పనుల ప్రాధాన్యతను వివరిస్తూ,నీటి వనరుల సంరక్షణ,భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.గ్రామాల్లో నీటి వనరులను కాపాడుకోవడంతో పాటు జలసిరి పనులను సమర్థవంతంగా చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో దర్పల్లి,గురుకుంట గ్రామాల సర్పంచులు బాలకిష్టమ్మరాములు,రవీందర్ రెడ్డి,ఉప సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్,ఉపాధి హామీ సిబ్బంది,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.