telangana
ప్రజాస్వామ్య పరిరక్షణకు కదం తొక్కనున్న మహా పాదయాత్ర
సూర్య జమ్మికుంట: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కరీంనగర్ వేదికగా జరగనున్న బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బిజెపి నాయకులు పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు కొలకాని రాజు, దొంతరవేని రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మాజీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ 23వ తారీఖున సోమవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన మహా పాదయాత్రకు బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియను బూచిగా చూపించి కాంగ్రెస్ పార్టీ, ఇతర సంఘ విద్రోహ శక్తులను కలుపుకుని దేశంలో అలజడి సృష్టించి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో జరిగినట్లు ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేయడానికి చేస్తున్న కుట్రలను దేశ ప్రజలు గమనించాలని అన్నారు. ముఖ్యంగా యువతి, యువకులను చైతన్య పరచడానికి కరీంనగర్ వేదికగా జరుగుతున్న మహా పాదయాత్రకు బిజెపి జాతీయ అధ్యక్షుడు స్వయంగా వస్తున్నారని తెలిపారు.ఏ పోలింగ్ బూత్ లో ఎన్ని అర్హుల ఓట్లు తొలగించారో వారి బూత్ ఏజెంట్ ద్వారా కాంగ్రెస్ నాయకులు చూపించాలని డిమాండ్ చేశారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చి మోడీ వెంటే దేశ ప్రజలు ఉన్నారనే సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సంఘ విద్రోహ శక్తులకు చూపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.