నేడు యుసుప్ పూర్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమం
రాయికోడ్, ; మండలంలోని యుసుప్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం నాడు పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ మాలి పట్లోళ్ల సంగారెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామంలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో చిన్నారులను గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని కోరారు.చుక్కలు వేయించండి.. పోలియో రహిత సమాజాన్ని నిర్మించండి అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈయొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు విజయవంతం చేయాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.