ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని
చౌటుప్పల్, మేజర్ న్యూస్: రేషన్ కార్డులు కలిగిన అర్హులైన కుటుంబాలన్నీ ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ పట్టణంలోని అన్ని వార్డు కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. అర్హులు రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో తమ వార్డు కార్యాలయాన్ని సంప్రదించి కుటుంబ సభ్యుల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.