BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి

Select Suryaa Now
ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి

రాజకీయం వారసత్వం కాదు

*గంగుల తిమ్మారెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి ఏర్పాటుచేసిన బాటను కొనసాగిస్తా

*గంగుల ఫణి కృష్ణారెడ్డి

ఫోటో. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం

ఆళ్లగడ్డ ,మేజర్ న్యూస్: రాజకీయం వారసత్వం కాదని తన తాత గంగుల తిమ్మారెడ్డి, తండ్రి గంగుల ప్రతాపరెడ్డి ఏర్పాటుచేసిన బాటను కొనసాగిస్తూ ప్రజల ఆశీర్వాదం కోసం ప్రజల మధ్యకు వస్తున్నానని భాజపా నేత, మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి తనయుడు 
గంగుల ఫణి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఇచ్చిన గౌరవం కోసం తమ ప్రయాణం ఆగాల్సి వచ్చింది అన్నారు. మా కుటుంబ పెద్దలు ఏర్పాటు చేసిన  బాటను కొనసాగించేందుకు తాను సరి తూగగలనా లేదా అన్నది తెలుసుకునేందుకే ప్రజల మధ్య కు వస్తున్నానన్నారు. ఈ ప్రయాణంలో ప్రజల అభిప్రాయం మేరకు తన అడుగులు ఉంటాయన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నీటి సమస్య నెలకొని ఉందని ప్రతి గ్రామంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా తాను ప్రజల్లోకి వెళ్లడం జరుగుతుందన్నారు. నాటికి, నేటికీ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని వాటికి అనుగుణంగానే తాను ముందు కు వెళ్తున్నానన్నారు. ప్రస్తుతం తాను బిజెపిలో కార్యకర్తనేనన్నారు. ఈ క్రమంలో తనకు రాజకీయాల కంటే తన కుటుంబ గౌరవాన్ని కాపాడడం, ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మా కుటుంబ పెద్దలు గంగుల తిమ్మారెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి లు దూర దృష్టితో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు . రాబోయే తరాలకు కూడా ఉపయోగపడే పనులు చేయగల సత్తా సమర్ధత నాలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి తన ప్రయాణం కొనసాగుతుందన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా