BREAKING
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అక్రిడేషన్ కార్డు చూపించినా అడ్డంకులే..! నామినేషన్ కేంద్రాల్లో పాత్రికేయులకు అవమానమా? అనుమతి నిరాకరణపై జర్నలిస్టుల ఆగ్రహం.. అధికారుల తీరుపై నిరసన చేర్యాలలో సమీకృత కార్యాలయ భవనంలో చోరీ.. రూ.4 లక్షల సామాగ్రి అపహరణ నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం.. రైతుల రాస్తారోకో 365బీ జాతీయ రహదారిపై ధర్నా.. నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రజల అభిప్రాయం మేరకే తన అడుగులు. యువ నాయకులు గంగుల ఫణి కృష్ణారెడ్డి ఇందిరమ్మ కుటుంబ బీమాను సద్వినియోగం చేసుకోవాలి: చైర్‌పర్సన్ పావని కమ్యూనిటీ హెల్పర్స్ లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన ఆడబిడ్డకు అండగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత! న్యాల్కల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి సిద్దిపేట జిల్లాకు ‘సురక్షిత్’ గుర్తింపు హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో మరో ముందడుగు గవర్నర్‌ను కలిసిన వైసీపీ బృందం.. ఎన్నికల ప్రక్రియపై ఫిర్యాదు రామకృష్ణ పై పీ డి యాక్ట్ నమోదు ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్ చోరీ..... రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు ఎంపికైన న్యూ రిషి పాఠశాల విద్యార్థులు

ఆడబిడ్డకు అండగా సర్పంచ్

Select Suryaa Now
ఆడబిడ్డకు అండగా సర్పంచ్

నవాబుపేట సూర్య న్యూస్:ఆడపిల్లల పట్ల సమాజంలో గౌరవం పెంపొందించడంతో పాటు ఆడబిడ్డల జననాన్ని ప్రోత్సహించాలనే మంచి సంకల్పంతో మండలంలోని కోళ్లగుట్ట తాండ గ్రామ సర్పంచ్ గుములమ్మ(భాస్కర్ నాయక్)అభినందనీయ నిర్ణయం తీసుకున్నారు.తండాలో ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ జన్మిస్తే ఆ చిన్నారి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేస్తానని శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..ఆడపిల్లలు కుటుంబానికి భారమేమీ కాదని,సమాజానికి గర్వకారణమని చాటిచెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఆడబిడ్డల పట్ల సానుకూల దృక్పథం పెంపొందించడంతో పాటు తల్లిదండ్రులకు కొంత ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ ముందడుగు వేసినట్లు పేర్కొన్నారు.సర్పంచ్ గుములమ్మ తీసుకున్న ఈ నిర్ణయంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామస్థాయిలో ఆడబిడ్డల జననాన్ని ప్రోత్సహించే ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.