andhrapradesh
నగరం మండలంలో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు
నగరం, మేజర్ న్యూస్:
డిసెంబర్ 2వ తేదీన జరగనున్న సాధారణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజైన శనివారం మండల పరిధిలోని ఆయా గ్రామ పంచాయతీల్లో 26 మంది సర్పంచ్, 82 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు తెలిపారు. పమిడిమర్రు పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, ఆరుగురు వార్డు సభ్యులకు, సజ్జావారిపాలెం పంచాయితీలో ఇద్దరు సర్పంచ్ కి, 8 వార్డు సభ్యులకు, అల్లపర్రు పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, ఉల్లిపాలెం పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, ఇద్దరు వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. చినమట్లపూడి పంచాయతీలో ఒకరు సర్పంచ్ కి, ఐదుగురు వార్డు సభ్యులకు, అద్దంకివారిపాలెం పంచాయితీలో ఇద్దరు వార్డు సభ్యులకు, ధూళిపూడి సౌత్ పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, ఏడుగురు వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. వెనిగళ్ళవారిపాలెం పంచాయితీలో ఇద్దరు సర్పంచ్ కి, ముగ్గురు వార్డు సభ్యులకు, కొలగానివారిపాలెం పంచాయితీలో 5 గురు సర్పంచికి, పదిమంది వార్డు సభ్యులకు, ధూళిపూడి నార్త్ పంచాయితీలో ఒకరు వార్డు సభ్యులకు, పూడివాడ పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, 12 వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లేపల్లి పంచాయతీలో ఒకరు సర్పంచ్, ఒకరు వార్డు సభ్యులుగా, పెద్దవరం పంచాయతీలో ఇద్దరు సర్పంచ్ కి, 13 వార్డు సభ్యులు, బెల్లంవారిపాలెం పంచాయితీలో ఇద్దరు సర్పంచ్ కి, 5 గురు వార్డు సభ్యులకు, ఏలేటిపాలెం పంచాయితీలో ఒకరు వార్డు సభ్యులుగా, పెద్దపల్లి పంచాయితీలో 5గురు వార్డు సభ్యులు, నగరం పంచాయతీలో ఒకరు సర్పంచ్, ఒకరు వార్డు సభ్యులుగా
తమ నామినేషన్లు దాఖలు చేశారు.