BREAKING
23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..! అంగరంగ వైభావంగా శ్రీలక్ష్మి నారాయణ, శివపార్వతుల కళ్యాణం రక్తదాన ఉద్యమంలో యువత భాగస్వాములు కావాలి: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి క్రిమినల్స్ ల్లో తొలగిన ఎన్ఓసీ టెన్షన్..! -ఎన్నికల్లో పోటీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్..? 9 నెలల్లో 334 కోట్లతో నగరాభివృద్ధి - మేయర్ దేవరకొండ సుజాత పేదల సొంతింటి కలకు నిజరూపం కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన కేంద్ర జల వనరుల శాఖ బృందం పర్యటన రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల నగదు ప్రోత్సాహకం వైకుంఠపురంలో కూటమి శంఖారావం .. జనప్రభంజనంతో భారీ ర్యాలీ వేంపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మాలేపాడు శోభారాణి నామినేషన్ సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ! ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం పరిశోధన రంగంలో భాగ్యకు డాక్టరేట్

సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ!

Select Suryaa Now
సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ!

సర్పంచ్ నామినేషన్లన్నీ ఆమోదం.. వార్డుల్లో నాలుగు తిరస్కరణ!

- ఓర్వకల్లు మండలంలోని 22 గ్రామపంచాయతీల్లో ముగిసిన పరిశీలన

- సర్పంచ్ స్థానాలకు 139కి 139 నామినేషన్లకు ఆమోదం

- వార్డు సభ్యుల స్థానాల్లో 486కి 482 ఆమోదం.. నాలుగు తిరస్కరణ

ఓర్వకల్లు మేజర్ న్యూస్:

ఓర్వకల్లు మండలంలోని 22 గ్రామపంచాయతీల పరిధిలో సర్పంచ్ స్థానాలకు దాఖలైన 139 నామినేషన్లన్నీ ఆమోదం పొందగా, వార్డు సభ్యుల స్థానాలకు సమర్పించిన 486 నామినేషన్లలో 482 ఆమోదం పొంది, నాలుగు తిరస్కరణకు గురయ్యాయని ఎంపీడీవో నాగ అనసూయ తెలిపారు. శనివారం నిర్వహించిన పరిశీలనలో ఈ వివరాలు వెల్లడైనట్లు పేర్కొన్నారు.

నామినేషన్ పత్రాలను ఎన్నికల నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హత కలిగిన వాటికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. దీంతో సర్పంచ్ స్థానాల్లో ఎలాంటి తిరస్కరణలు లేకపోగా, వార్డు సభ్యుల స్థానాల్లో మాత్రమే నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉండటంతో అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.