BREAKING
ముగిసిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మహిళలు స్వయం శక్తితో ఎదగడమే మెదక్ మిల్లీ అసోసియేషన్ లక్ష్యం కుట్టు శిక్షణ పూర్తి చేసిన 44 మంది మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేసే పంటలపై రైతులకు అవగాహన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లాలో విద్యుత్ రంగానికి మహర్దశ శ్రీరాయగిరి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కైశిక ద్వాదశి ప్రత్యేక పూజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం ఫ జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పెద్దపంజాణిలో ముగిసిన ఉపసంహరణల పర్వం గుండె తీసినంత పనయింది ( కథ ) లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు మిట్స్‌లో ఆర్థిక అక్షరాస్యత,స్మార్ట్ పెట్టుబడి విధానాలపై వర్క్‌షాప్ : ముఖ్యఅతిథిగా హాజరైన సెబీ స్మార్ట్ ప్రతినిధి డాక్టర్ మూర్తి ఇరుకాలమ్మ సబ్‌స్టేషన్‌లో అదనపు 8 ఎంవిఎ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ అండ్ 33 కెవి బ్రేకర్ ఏర్పాటు రైల్వే రోడ్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కనుమర్లపూడి వెంకటనారాయణ జోరుగా ఇంటింటి ప్రచారం. 23 నుండి గంగవరంలో ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 26వ వార్డులో జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. టిడిపి అభ్యర్థి కోట సురేందర్ రెడ్డి కి మహిళలు బ్రహ్మరథం..!

9 నెలల్లో 334 కోట్లతో నగరాభివృద్ధి - మేయర్ దేవరకొండ సుజాత

Select Suryaa Now
9 నెలల్లో 334 కోట్లతో నగరాభివృద్ధి  - మేయర్ దేవరకొండ సుజాత

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ మౌలిక వసతుల కల్పనతో పాటు వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో తన పాలనలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మేయర్ దేవరకొండ సుజాత హర్షం వ్యక్తం చేశారు. 
కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మేయర్ సుజాత అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

సమావేశంలో ప్రవేశపెట్టిన 41 అజెండాలు, 3 టేబుల్ అజెండాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 
 మేయర్ మాట్లాడుతూ  రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ల సారధ్యంలో వారి సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించడంలో సఫలీకృతమయ్యానని ప్రకటించారు.
మేయర్ గా తన పరిపాలన కాలంలో నెల్లూరు నగర పాలక సంస్థలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వినిపించారు. 
మొత్తం 9 నెలల పాలనలో 334.59 కోట్ల రూపాయలతో నగర పాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేశామని మేయర్ ప్రకటించారు.
ఇందుకు సహకరించిన సహచర కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, డివిజన్ల నాయకులు, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా మేయర్ కృతజ్ఞతలు తెలియజేసారు.
అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ 2021 - 26 పాలకమండలి సభ్యుల పదవీకాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని సమావేశంలో భాగంగా నిర్వహించారు. 
రూరల్ ఎమ్మెల్యే, కమిషనర్ వై.ఓ నందన్, డిప్యూటీ మేయర్లు సభ్యులందరికీ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. 
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, ఎస్ ఈ రహమత్ జాని, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు,అడిషనల్ కమిషనర్ హిమబిందు, ఎగ్జామినర్ శివశంకర్ రెడ్డి, ఈఈ శేషగిరిరావు, చంద్రయ్య, అనిల్ కుమా ర్, హెల్త్ ఆఫీసర్ దినేష్, ఇన్చార్జి సిపి రఘునాథరావు, కౌన్సిల్ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఈ పి ఆర్ ఓ వాసు బాబు, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్, కో ఆప్షన్ సభ్యులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.