లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు
లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు
కుకునూరుపల్లి, మేజర్ మండల పరిధిలోని మేదినిపూర్ కోనాయిపల్లి గ్రామాల సర్పంచులు భూర్గు మధుమోహన్ పిట్ల మంజుల రాములు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పెన్షన్ దారులకు ధ్రువీకరణ పత్రాలను శనివారం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందూరి ఐలయ్య తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందజేయడమే కాంగ్రెస్ లక్ష్యం, గ్రామ అభివృద్ధికి అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల నాగరాజు సెక్రెటరీ నవనీత మమత వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.