కోహిర్ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
కోహిర్ ; కోహిర్ మండల కేంద్రంలోని
విద్యార్థినుల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో కోహిర్ పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రెండో వార్డు కౌన్సిలర్ ఎన్. సంపత్ కుమార్ చేతుల మీదుగా 50 మంది హాస్టల్ విద్యార్థినులకు వివిధ రకాల సామగ్రిని అందజేశారు.హాస్టల్ వార్డెన్ లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు స్టీల్ ప్లేట్లు, ఉన్ని దుప్పట్లు, స్టీల్ గ్లాసులు, స్టీల్ మగ్గులు, స్టీల్ స్పూన్లు, స్టీల్ కప్పులు, బూట్లు, సాక్సులు తదితర వస్తువులను పంపిణీ చేశారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థినులకు ఉన్ని దుప్పట్లు అందించడం విశేషం.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎన్. సంపత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థినులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్ పాల్గొని విద్యార్థినులకు వస్తువుల పంపిణీలో భాగస్వాములయ్యారు. హాస్టల్ వార్డెన్ లలిత, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.