BREAKING
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి – బోరేగావ్ సర్పంచ్ నగేందర్ పాటిల్ పీహెచ్‌డీ వైవా విజయవంతంగా పూర్తి చేసిన తిరుమల రూపేష్ భక్తిపారవశ్యంలో కోటి దీపోత్సవం.. ఆధ్యాత్మిక శోభతో ఆలయ ప్రాంగణం మిలటరీ గ్రామం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు “సురక్షిత్ బచ్పన్ అభియాన్” పై అవగాహన సదస్సు" కూటమి బలపరిచిన కోవూరు సర్పంచి అభ్యర్థిగా వల్లెపు సునీల్ బాబు పంటపాలెం పారిశ్రామిక ప్రాంతంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఎస్‌ఈని కోరిన పారిశ్రామిక వినియోగదారులు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి కమలాకర్ రెడ్డి ఎన్నికల అధికారులకు శిక్షణ..! జన సందోహం మధ్య... సర్పంచ్ అభ్యర్థిగా ఆలపాక నామినేషన్ సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ ఆత్మకూరు మండలంలో ఏకగ్రీవం కానున్న పలు పంచాయతీలు విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యత.. మంచినీటి ట్యాంక్ డీప్ క్లీనింగ్‌కు కార్పొరేటర్ విజయలక్ష్మి చర్యలు! ఆత్మీయ పలకరింపులతో ముగిసిన చివరి కౌన్సిల్ సమావేశం

సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ

Select Suryaa Now
సౌత్ మోపూర్ సర్పంచ్ బరిలో బండి అంకమ్మ

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :  నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్ మోపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సందడి మొదలైంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు ఒక్కొక్కరుగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంటోంది. ఈ క్రమంలో సౌత్ మోపూర్ గ్రామానికి చెందిన బండి అంకమ్మ సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. శనివారం ఆమె సంబంధిత ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్న బండి అంకమ్మ నామినేషన్ దాఖలు చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు.గ్రామపంచాయతీ ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధిగా అవకాశం దక్కించుకోవాలనే లక్ష్యంతో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.సౌత్ మోపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేయనున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి అంకమ్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం ఎన్నికల పోటీలో మరో ఆసక్తికర పరిణామంగా నిలిచింది.